నేడు హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ రానున్నారు. వివిధ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటా కానున్నారు.;
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ రానున్నారు. వివిధ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటా కానున్నారు. తనకు మద్దతు ప్రకటించాలని కోరనున్నారు. యశ్వంత్ సిన్హా కు ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుసుకోవాలని యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్నారు. తొలుత ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు.
కాంగ్రెస్ తో ....
అనంతరం టీఆర్ఎస్ సభ్యులతో భేటీ అవుతారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలవాల్సి ఉన్నా వారు అంగీకరించలేదు. కేసీఆర్ ను కలిసిన తర్వాత తమను కలవడం అనవసరం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఇక్కడ టీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలతోనే యశ్వంత్ సిిన్హా సమావేశం అవ్వనున్నారు.