అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి హైదరాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందారు;

Update: 2025-01-30 03:09 GMT
wagid, hyderabad, died, road accident in america
  • whatsapp icon

అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి హైదరాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందారు. చికాగోలో జరిగిన యాక్సిడెంట్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన యువకుడు ఖైరతాబాద్ వాసి మహ్మద్ వాజిద్ గా గుర్తించారు. అయితే కాంగ్రెస్ ఎన్ఆర్ఐ కమిటీ మైనార్టీ శాఖ సభ్యుడిగా వాజిద్ ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ మైనారిటీ శాఖ...
అక్కడే విద్యను అభ్యసించిన వాజిద్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు. వాజిద్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వాజిద్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వాజిద్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు పలువురు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News