పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న బంగారం ధరలు

పాక్ లో అన్ని ధరలు నింగినంటుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బంగారం ధరలు భారీగా పెరిగాయి

Update: 2023-03-04 08:12 GMT

పాక్ లో అన్ని ధరలు నింగినంటుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయి. పెట్రోలు ధరలు మూడు వందలకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 2.06 లక్షలు పలుకుతుంది. దీంతో బంగారం దుకాణాలు వెలవెల పోతున్నాయి.

నిత్యావసర వస్తువులు...
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ బంగారం కొనే పరిస్థిితి లేదు. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.280లకు చేరుకోవడంతో పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వ్ బ్యాంకు కూడకా బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. పన్నులతో ప్రజలపై భారం మోపుతున్నా పరిస్థితి కుదుటపడటం లేదు. లీటరు పాలు 210 రూపాయలు పలుకుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది.


Tags:    

Similar News