స్కూల్ పై దాడి.. 41 మంది మృతి

శనివారం వివరాలు వెల్లడించిన పోలీసులు.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలో..

Update: 2023-06-17 11:18 GMT

ఉగాండాలో ఓ స్కూల్ పై జరిగిన దాడిలో విద్యార్థులు, సిబ్బంది సహా 41 మంది మరణించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించిన పోలీసులు.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ దారుణానికి కారణం అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ గ్రూపేనని తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారు పరారీలో ఉన్నారని తెలిపారు.

దుండగులు హాస్టల్ ను తగులబెట్టి ఆహారాన్ని దోచుకున్నట్లు తెలిపారు. యుపిడిఎఫ్ (ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్), పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు స్థానికంగా ఉన్న విరుంగా నేషనల్ పార్కు వైపుగా పారిపోయినట్లు గుర్తించామన్నారు. వారికోసం వెతుకున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కాగా.. మృతుల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. కొంతమందిని దుండగులు ఎత్తుకుపోయినట్లుగా తెలుస్తోంది.





Tags:    

Similar News