
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. భారత్ లో మాత్రం ఇది కనిపించదని ఖగోళ శాస్త్ర వేత్తలు తెలిపారు.
భారత్ లో మాత్రం...
నేడు తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో దానిని వీక్షించేందుకు యూరప్, ఆసియా దేశాల్లో ఖగోళ శాస్త్రవేత్తలు ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేరుగా చూడకుండా ఉంటే మంచిదని కొందరు సూచిస్తును్నారు. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుందని తెలిపారు. సాయంత్రం 6.13 గంటలకు సూర్య గ్రహణం పూర్తవుతుందని తెలిపారు.