ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక సంపన్నులు వీరే

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా-2025 విడుదలైంది. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది;

Update: 2025-04-03 02:17 GMT
forbes, billionaires,  3,028 this year, world
  • whatsapp icon

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా-2025 విడుదలైంది. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గ‌తేడాది బిలియనీర్ల సంఖ్యతో పోలిస్తే 247 మంది ఎక్కువగా ఉన్నారు. ప్ర‌పంచ‌ బిలియనీర్ల సమష్టి సంపద 16.1 ట్రిలియన్ డాల‌ర్లుగా ఫోర్బ్స్‌ పేర్కొంది. 2024తో పోలిస్తే 2 ట్రిలియన్ల డాల‌ర్ల సంప‌ద పెరిగిందని తెలిపింది. ఇక ర్యాంకింగ్స్‌లో అమెరికా 902 బిలియనీర్లతో అగ్ర‌స్థానంలో ఉంటే తర్వాత స్థానాల్లో వ‌రుస‌గా చైనా లో 516 మంది, ఇండియాలో 205మంది ఉన్నారు.

అంబానీ 18 వస్థానంలో...
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత‌ ముకేశ్‌ అంబానీ 92.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. మరో భారతీయుడు గౌతమ్‌ అదానీ 56.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 28వ స్థానానికి పడిపోయారు. కాగా, ఈ జాబితాలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలం చేసుకున్నారు. 342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో టాప్‌లో నిలిచారు. మస్క్‌ తర్వాత ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ బుకర్‌బర్గ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ 216 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 215 బిలియన్‌ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు.


Tags:    

Similar News