ఆర్మీ విమానానికి ప్రమాదం.. ఆ నలుగురు గురించే

కనిపించకుండా పోయారు.. డిఫెన్స్ విమానం కూలిపోయిన ఘటనలో నలుగురు కనిపించకుండా పోయారు.

Update: 2023-07-29 01:49 GMT

డిఫెన్స్ విమానం కూలిపోయిన ఘటనలో నలుగురు కనిపించకుండా పోయారు. ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ (ఎడిఎఫ్) హెలికాప్టర్ క్వీన్స్‌లాండ్ తీరంలో సముద్రంలో కూలిపోవడంతో నలుగురు కనిపించడం లేదని రక్షణ మంత్రి తెలిపారు. ఆస్ట్రేలియా మీడియా వారు చనిపోయారని కథనాలు ప్రసారం చేసింది. హెలికాప్టర్ US-ఆస్ట్రేలియా మధ్య ద్వైవార్షిక టాలిస్మాన్ సాబెర్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో భాగమైంది. శుక్రవారం అర్థరాత్రి హామిల్టన్ దీవికి సమీపంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ మునిగిపోయిందని రిచర్డ్ మార్లెస్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ సంఘటన గురించి విమానంలోని నలుగురు సభ్యులకు సంబంధించిన కుటుంబాలకు తెలియజేశారు. సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం తమ పనిని కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ క్యాంప్‌బెల్ ఈ ప్రమాదాన్ని ఒక భయంకరమైన క్షణంగా అభివర్ణించారు. ప్రస్తుతానికి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ను నిలిపివేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు జూలైలో రాక్‌హాంప్టన్ సమీపంలో US ఆర్మీ ట్యాంక్ కు జరిగిన ప్రమాదంలో ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చారు.


Tags:    

Similar News