Spain : స్పెయిన్ లో భారీ వర్షాలు.. వరదలు.. వందల మంది మృతి

తూర్పు స్పెయిన్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు.

Update: 2024-10-31 01:56 GMT

తూర్పు స్పెయిన్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పటికే 72 మంది వరకూ మరణించారని అధికారికంగా ధృవీకరించారు. గల్లంతయిన వారి సంఖ్య పదుల్లోనే ఉంది. వరదల తాకిడికి ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆస్తి నష్టం కూడా తీవ్రంగానే జరిగింది. గల్లంతయిన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. కార్లు వరదల్లో కొట్టుకుపోవడాన్ని చిత్రికరించి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి.

గల్లంతయిన వారి కోసం...
తూర్పు స్పెయిన్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. సైనికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలను ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సాయపడ్డాయి. వృద్ధులు,చిన్నారులను రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఆస్తి నష్టం అంచనా వేయడం కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. తూర్పు స్పెయిన్ లో మాత్రమే కాదు... దక్షిణ స్పెయిన్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి డ్రోన్లతో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సైనికుల సలహాలు, సూచనలను పాటించాలని ప్రభుత్వం కూడా కోరింది.



Tags:    

Similar News