Nepal : నేపాల్‌లో భారీ వర్షాలు... ఎంతమంది బలయ్యారో తెలుసా?

నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం వరదల తాకిడికి గురవుతుంది.

Update: 2024-09-30 03:43 GMT

నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం వరదల తాకిడికి గురవుతుంది. ఇప్పటి వరకూ నేపాల్ లో వరదల కారణంగా 170 మంది వరకూ చనిపోయారని అధికారులు తెలిపారు. అదే సమయంలో 42 మంది గల్లంతయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అనేక మంది గాయపడగా, మరికొందరు నీట మునిగి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పాందుతున్నారు. తూర్పు మధ్య నేపాల్ లోని అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటిమట్ట మయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగానే ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

సహాయక కార్యక్రమాలు...
అయితే సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ సిబ్బంది అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వరదలతో కొండచరియలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందచేస్తున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో మరెంత మంది వరదల్లో చిక్కుకుపోతారోనని ఆందోళన వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News