విషాదం.. పడవ మునిగి 34 మంది మృతి
ఆ పడవలో సుమారు 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్లు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. శరణార్థులంతా ఇరాన్..
సొంతదేశంలో పొట్టకూటికి దిక్కులేక, క్లిష్టపరిస్థితుల్లో బతకలేక, మరో గత్యంతరం లేక పొరుగు దేశాలకు వలస వెళ్తూ శరణార్థులు అనేక సార్లు సముద్రంలో ప్రమాదాలకు గురవుతూ.. మృతిచెందుతున్నారు. తాజాగా ఇటలీ తీరంలోనూ అలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 34 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండటం స్థానిక అధికారులను కలచివేసింది.
ఆ పడవలో సుమారు 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్లు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. శరణార్థులంతా ఇరాన్, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ కు చెందినవారుగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలో ఉన్న బండరాళ్లను బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు రెండు ముక్కలు కావడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు. వారిలో 50 మందిని అధికారులు రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.