Earth Quke : ఎక్కడ చూసినా మట్టి దిబ్బలే.. మృతుల సంఖ్య పదివేలు దాటొచ్చట
మయన్మార్, బ్యాంకాక్ ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. భూకంపానికి వేలాది మంది మరణించారని తెలిసింది;

మయన్మార్, బ్యాంకాక్ ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. భూకంపానికి వేలాది మంది మరణించారని తెలిసింది. దాదాపు ఏడు వందల మందికి పైగా మరణించినట్లు ఇప్పటికే అధికారిక లెక్కలు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్య రోజురోజూకూ పెరుగుతుంది. ఎన్నో వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఎంతో మంది అనాధలుగా మారారు. కంటి ముందే కన్నవారు, కన్నపిల్లలను కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్నారు. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. పది వేలకు పైగానే మృతులు సంఖ్య చేరుకుంటుందని అమెరికాకు చెందిన ఏజెన్సీ తెలపడంతో ఈ లెక్క ప్రపంచాన్ని సయితం వణికిస్తుంది. బ్యాంకాక్ లోనూ వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. వారు కనీసం ప్రాణాలతో బయటపడితే చాలు అని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.