Earh Quake : మయన్మార్ ను వదలని భూకంపాలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని
మయన్మార్ ను వరస భూకంపాలు వణికిస్తున్నాయి. వరసగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు తున్నారు;

మయన్మార్ ను వరస భూకంపాలు వణికిస్తున్నాయి. వరసగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు సాగిస్తున్నారు. ఆదివారం కూడా మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1 గా నమోదయింది. ఇప్పటి వరకూ భూకంపాల వల్ల 1700 మంది వరకూ మరణించినట్లు చెబుతున్నారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
జాగారం చేస్తూనే...
వరస భూప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు నిద్రలేమితో జాగారం చేస్తూ ఎప్పుడు భూంకంపం వస్తుందోనని బితుబితుకుమంటూ గడుపుతున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ధాటికి పడిపోయిన భవనాల శిధిలాలను తొలగించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. దాదాపు పదివేలకు మందికి పైగానే మృతుల సంఖ్య ఉండే అవకాశముందని చెబుతున్నారు. అనేక వీధుల్లో శిధిలాల కింద మృతదేహాలు కుళ్లిపోతుండటంతో భరించలేని దుర్గంధం వ్యాప్తి చెందుతుంది.
శిధిలాల తొలగింపు...
అయితే శిధిలాల కింద ఎవరైనా ఉంటే ప్రాణాలతో ఉండి ఉంటే వారికి ఎలాంటి గాయాలు కాకుండా మిషనరీలతో కాకుండా చిన్నగా చిన్న చిన్న వస్తువులతో శిధిలాలను తొలగిస్తున్నారు. రహదారులన్నీ శిధిలమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. ఇంకా సమాచార వ్యవస్థ మెరుగుపడలేదు. మరొకసారి భూకంపం వస్తుందన్న భయం వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంతర్జాతీయ సమాజం సహాయక బృందాలతో పాటు ఆహారం, మందులు వంటి వాటిని పంపారు. పునరావాస కేంద్రాల్లోనే ఇప్పటికీ కొందరు తలదాచుకున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందన్న దానిపై ఇంకా ఒక అంచనాకు రాలేదు. మొత్తం మీద మయన్మార్ వరస భూకంపాలతో విలవిలాడుతుంది.