నాసా ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన వెబ్ టెలిస్కోప్

నాసా శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కష్టపడి తయారు చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. గయానా స్పేస్ సెంటర్ నుంచి డిసెంబర్ 25 ఉదయం 07:20 (భారత కాలమానం

Update: 2021-12-25 12:47 GMT

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. నాసా శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కష్టపడి తయారు చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. గయానా స్పేస్ సెంటర్ నుంచి డిసెంబర్ 25 ఉదయం 07:20 (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.50) దీనిని లాంచ్ చేశారు. మిషన్ లా పనిచేసే ఈ టెలిస్కోప్ ద్వారా విశ్వంలోని రహస్యాలను చేధించాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైమ్ మెషీన్ వంటిది.

ఖగోళ శాస్త్రవేత్తలు, స్కైవాచర్లకు కానుక

అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్ ఇ.వెబ్ పేరునే ఈ టెలిస్కోప్ కు నామకరణం చేశారు. హబుల్ టెలిస్కోర్ వారసత్వాన్ని కొనసాగించేందుకు రంగంలోకి దిగుతున్న దీనిని.. సైంటిస్టులు షార్ట్ కట్ లో వెబ్ అని పిలుచుకుంటున్నారు. కాగా..అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. నేడు క్రిస్మస్ సందర్భంగా.. నాసా.. ఖగోళ శాస్త్రవేత్తలు, స్కైవాచర్లకు ఈ ప్రత్యేక కానుకను అందించింది.


Tags:    

Similar News