ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు..ఆందోళనలో తల్లిదండ్రులు
భారత్ కుచెందిన దాదాపు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది విద్యార్థులే ఉన్నారు.
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. యుద్ధం ఎప్పుడైనా జరగొచ్చు. ఉక్రెయిన్ ను మూడు ప్రాంతాల నుంచి ఆక్రమించుకోవాలని రష్యా బలగాలను మొహరించింది. అయితే అన్ని దేశాలు తమ పౌరులను వెనక్కు వచ్చేయాలని కోరుతున్నాయి. భారత్ కుచెందిన దాదాపు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది విద్యార్థులే ఉన్నారు.
గుజరాత్ కు చెందిన వారే....
ఈ పద్దెనిమిది వేల మందిలో ఐదు వేల మంది గుజరాత్ కు చెందిన వారే ఉన్నారు. ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు గుజరాత్ ముఖ్యమంత్రిని కలసి తల్లిదండ్రులు తమ పిల్లలను భారత్ కు రప్పించాలని కోరారు. ఎక్కువగా ఉక్రెయిన్ కు ఎంబీబీఎస్ చదివేందుకే విద్యార్థులు వెళుతుంటారు.