ఒకేసారి రూ.84 పెరిగిన పెట్రోల్ !
శ్రీలంకకు చెందిన లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) నిన్న చమురు ధరలను పెంచింది. అందుకు అనుగుణంగా..
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.338కి చేరింది. శ్రీలంకకు చెందిన లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) నిన్న చమురు ధరలను పెంచింది. అందుకు అనుగుణంగా గత అర్థరాత్రి సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను ఏకంగా రూ.84 మేర పెంచేసింది.
దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.338కి చేరుకుంది. ఒకరోజే రూ.84 మేర పెట్రోల్ ధరను పెంచడంపై లంక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం సహా.. గుడ్లు, మాంసాహారం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో నిత్యవసరాలను కొనలేక.. చాలా మంది ఆకలితో అల్లాడిపోతున్నారు.