నేడు కీలక ఒప్పందాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి

Update: 2021-12-06 01:59 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. కీలక అంశాలపై ఒప్పందాలు జరగనుండటంతో ఇతర దేశాలు కూడా పుతిన్ భారత్ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నారు. దాదాపు పది కీలక ఒప్పందాలు భారత్ - రాష్యాల మధ్య జరిగే అవకాశముంది.

పది అంశాలపై...
వాణిజ్యం, రక్షణ, పర్యావరణం తదితర అంశాలపై రెండు దేశాలు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ప్రధాని మోదీతో పుతిన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. భారత్ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఎస్ - 400 ను వేగంగా అందించాలని భారత్ కోరనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు పుతిన్ రాకతో మరింత బలపడనున్నాయి.


Tags:    

Similar News