భారత్ - రష్యా మధ్య శిఖరాగ్ర సదస్సు
ప్రధాని మోదీ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. రేపు భారత్, రష్యాల మధ్య వివిధ అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. రేపు భారత్, రష్యాల మధ్య వివిధ అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి. భారత్ - రష్యా మధ్య రేపు శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈరోజు భారత్ కు చేరుకోనున్న పుతిన్ రేపంతా భారత్ తో సంబంధాలు, వివిధ అంశాలపై చర్చించనున్నారు. అదే రోజు రాత్రి తిరిగి ప్రయాణమవుతారు.
అనేక అంశాలపై...
రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. చాలా కాలం తర్వాత పుతిన్ భారత్ కు వస్తుండటంతో ఆయనకు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా జరనున్న అనేక ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. పుతిన్ రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.