విదేశీ అప్పులు కట్టలేం : తేల్చి చెప్పేసిన శ్రీలంక ప్రభుత్వం

తమ దేశాన్ని ఆర్థిక, ఆహార సంక్షోభం నుంచి రక్షించుకునేందుకు అంతర్జాతీయ దేశాలు సహాయం చేయాలని..

Update: 2022-04-12 08:29 GMT

కొలంబో : తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాల నుంచి తీసుకున్న 51 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.88 లక్షల కోట్లు) అప్పును ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టేస్తామని దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది. మరోవైపు శ్రీలంక ఖజానా ఖాళీ అవ్వడంతో ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ)కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ విన్నవించింది. ఐఎంఎఫ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

తమ దేశాన్ని ఆర్థిక, ఆహార సంక్షోభం నుంచి రక్షించుకునేందుకు అంతర్జాతీయ దేశాలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వాలు చేసిన విదేశీ అప్పుల కారణంగానే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాలా తీసినట్లు చెప్పుకొచ్చింది. తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా తీసుకోవచ్చని లేదా శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది.



Tags:    

Similar News