న్యూయార్క్ నగరంలో 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ'

సబ్‌వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. రోడ్లను మూసివేసేశారు

Update: 2023-09-29 17:49 GMT

కుండపోత వర్షాల కారణంగా న్యూయార్క్ నగరం అంతటా ఆకస్మిక వరదలు సంభవించాయి. సబ్‌వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. రోడ్లను మూసివేసేశారు. సీఎంతో న్యూయార్క్ గవర్నర్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నాటికి 5.08 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. న్యూయార్క్‌కు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పట్టించుకోవాలని న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ నగర వాసులను కోరారు. లాంగ్ ఐలాండ్, హడ్సన్ వ్యాలీలో కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న వారితో పాటూ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఉదయం న్యూయార్క్‌లోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. బ్రూక్లిన్, మాన్‌హట్టన్, క్వీన్స్, న్యూజెర్సీలోని హోబోకెన్‌లోని రోడ్లు వర్షపు నీటిలో మునిగిపోవయాయి. పలు రోడ్లను అధికారులు మూసివేశారు. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీ (MTA) బ్రూక్లిన్, క్వీన్స్‌లను కలిపే G లైన్‌తో సహా అనేక సబ్‌వే లైన్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరారు.


Tags:    

Similar News