Big Breaking : ఘోర రైలు ప్రమాదం - 15 మంది మృతి
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఢాకాలో రెండు రైళ్లు ఢీకొని పదిహేను మంది మృతి చెందినట్లు సమాచారం
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఢాకాలో రెండు రైళ్లు ఢీకొని పదిహేను మంది మృతి చెందినట్లు సమాచారం. పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. ఢాకాకు ఎనభై కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని...
మొత్తం వంద మంది వరకూ గాయాలపాలయినట్లు తెలిసింది. రెండు రైళ్లు ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.