ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల భరణం..దుబాయ్ ప్రధానికి షాక్

దుబాయ్ పాలకుడు, ప్రధాని అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ - మక్తూమ్ (72) తన మాజీ భార్య అయిన యువరాణి హయా బింట్ అల్ హుస్సేన్ కు

Update: 2021-12-22 06:37 GMT

దుబాయ్ పాలకుడు, ప్రధాని అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ - మక్తూమ్ (72) తన మాజీ భార్య అయిన యువరాణి హయా బింట్ అల్ హుస్సేన్ కు (728 మిలియన్ డాలర్లు) అండే మన కరెన్సీలో అక్షరాలా రూ.5 వేల 500 కోట్లను విడాకుల భరణం కింద ఇవ్వాల్సిందేనని యూకేలోని లండన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో దుబాయ్ పాలకుడు ఖంగుతిన్నాడు. ఈ భరణంలో ముందుగా రూ.2,516 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. మిగిలిన మొత్తాన్ని మూడునెలల్లో సెటిల్ మెంట్ చేయాలని తెలిపింది. అలాగే కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులొచ్చేంత వరకూ ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను కూడా భరించాలని కోర్టు స్పష్టం చేసింది.

కాగా.. ఈ భరణం ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్ మెంట్ గా నిలవనుంది. అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్‌ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె, పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరి. జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. ఆ తర్వాత అల్ మక్తూమ్ తన పిల్లలనుతనకు అప్పగించాలంటూ జర్మనీని అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను జర్మనీ తిరస్కరించింది. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. భద్రత, స్వేచ్ఛ కోసం హయా బింట్ యూకే కోర్టును ఆశ్రయించగా.. మాజీ భార్య భద్రతకు, వారి ఇద్దరు పిల్లలైన అల్ జలీలా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్ (14), షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ (9)ల భద్రతకు అయ్యే ఖర్చుని అల్ మక్తూమ్ భరించాల్సిందిగా ఆదేశించింది.


Tags:    

Similar News