దగ్గుమందు తాగి 66 మంది చిన్నారులు మృతి

వీటిలో పరిమితికి మించి డైథిలిన్‌ గ్లైకోల్‌, ఇథిలిన్‌ గ్లైకోల్‌ ఉన్నట్టు గుర్తించారు. ఇవి పరిమితి దాటితే విషపూరితంగా..

Update: 2022-10-06 03:46 GMT

దగ్గుమందు తాగి 6 మంది చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన గాంబియాలో జరిగింది. భారత్ కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్ లు తాగడం వల్లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు తలెత్తి.. 66 మంది చిన్నారుల మృతికి కారణమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రొమెథజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మాలిన్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మేకాఫ్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌ అనే నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌ జారీ చేసింది.

వీటిలో పరిమితికి మించి డైథిలిన్‌ గ్లైకోల్‌, ఇథిలిన్‌ గ్లైకోల్‌ ఉన్నట్టు గుర్తించారు. ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారుతాయని మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌లో పేర్కొన్నారు. గాంబియాలో జరిగిన దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్పత్తులు సురక్షితం కాదని, వాటి ఉపయోగం చిన్నారుల మరణాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ప్రొడక్టులను గుర్తించి.. అమ్మకాల నుంచి తప్పించాలని సూచించింది.


Tags:    

Similar News