IPL 2024 : గెలవాల్సిన మ్యాచ్ లో గెలిస్తే ఆ మజా వేరు గురూ టెన్షన్ పెట్టి మరీ చివరకు గెలిచారుగా
గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది
గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ మ్యాచ్ గెలిచి అధికారికంగా ప్లేఆఫ్ కు చేరాలని భావించింది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ తక్కువ పరుగులకే అవుట్ అయింది. ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 141 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో రియన్ పరాగ్ ఒక్కడే గౌరవప్రదమైన స్కోరు చేయగలిగాడు. 35 బంతులను ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. అతనే ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్. ఇందులో ఒక ఫోర్ మూడు సిక్స్ లు ఉన్నాయి.
టాస్ గెలిచి...
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, బట్లర్ బరిలోకి దిగారు. అయితే 24 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ అవుట్ కావడంతో కీలక వికెట్ ను చెన్నై చేజిక్కించుకుంది. సిమర్ జీత్ వేసిన బంతిని క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత 21 పరుగులు చేసిన బట్లర్ ను కూడా సిమర్ జీత్ అవుట్ చేశాడు. అతను కూడా తుషార్ దేశ్ పాండే కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పది ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ స్కోరు 61 పరుగులు మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో ఎక్కువ పరుగులు రాట్టలేకపోయారు. కెప్టెన్ సంజూ శాంసన్ పది హేను పరుగులకు అవుట్ అయ్యాడు. సమర్ జీత్ సింగ్ కే మళ్లీ చిక్కాడు. మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ లో పరాగ్ 47 పరుగులు చేయగా, ధ్వు్ జురెల్ 28, సంజు శాంసన్ పదిహేను పరుగులు చేశారు.
లక్ష్యాన్ని ఛేదించడంలో...
142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రలు ధాటుగా ఆడారు. రచిన్ రవీంద్ర 27 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో నాలుగు ఓవర్లకు చెన్నై స్కోరు 34 పరుగుల చేసింది. 22 పరుగుల వద్ద మిచెల్ అవుట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడుతున్నారు. మొయిన్ ఆలీ కూడా వెనువెంటనే వెనుదిరగడంతో చెన్నై కొంత కష్టాల్లో పడినట్లు కనిపించినా స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదని అనిపించింది. రుతురాజ్ గైక్వాడ్, జడేజా లు కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించారు. పదిహేను పరుగులకు చెన్నై స్కోరు 116 కావడం ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉండటంతో చెన్నై విజయం దాదాపు ఖాయమనిపించింది. జడేజా రనౌట్ కావడంతో కొంత అయోమయంలో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వి వచ్చాడు. నాలుగు ఓవర్లకు 21 పరుగులు చేయాలి. పెద్దకష్టమేమీ కాకపోయినా పరుగులు రాకపోవడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. మూడు ఓవర్లలో పదమూడు పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. గైక్వాడ్ సిక్సర్ కొట్టడంతో చెన్నై విజయం ఖాయమింది. ఎట్టకేలకు చివరకు చెన్నైదే విజయం అయింది. ఐదు వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. ఇంకా పది బంతులు మిగిలి ఉండగానే రెండు ఫోర్లు కొట్టి చెన్నైకు రిజ్వి విజయాన్ని అందించాడు