IPL 2024 : అరెరే.. అహ్మదాబాద్ లో అలా చేశారే.. కావ్య పాపకు ఇలా షాకిచ్చారేమిటి భయ్యా?

అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో హైదరాబాద్ అతి తక్కువ పరుగులు చేసింది

Update: 2024-03-31 13:23 GMT

అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో హైదరాబాద్ అతి తక్కువ పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 29 పరుగులు, అబ్దుల్ సమద్ 29 పరుగులు చేసి ఇద్దరు మాత్రమే అత్యధిక పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆడలేదు. క్రీజులో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. షాబాజ్ అహ్మద్ 22, ట్రావిస్ హెడ్ 19, మయాంక్ అగర్వాల్ 16, మార్ క్రమ్ 17 పరుగుల చేశారు.

తొలుత బ్యాటింగ్ కు దిగి...
గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా, ఒమరాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లు తలో వికెట్లు తీశారు. ఉప్పల్ లో మాదిరిగా భారీ స్కోరు చేయాలని టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు తక్కువ స్కోరుకే అవుట్ అయింది. అయితే గుజరాత్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హైదరాబాద్ లో ఇరగదీసిన వాళ్లంతా అహ్మదాబాద్ లో చాపచుట్టేశారు. అందుకే స్కోరు తక్కువగా నమోదయింది. దీంతో సన్ రైజర్ ఫ్యాన్స్ నిరాశలో పడ్డారు.
ఛేజ్ చేసేందుకు...
స్వల్ప లక్ష్యాన్ని సాధించే దిశగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ సాహా, శుభమన్ గిల్ శుభారాన్ని అందించినా తర్వాత వారిద్దరూ అవుట్ కావడంతో స్కోరు కొంత నెమ్మదిగా సాగింది. సాహా పది పరుగులు చేసి అవుటయ్యాడు. శుభమన్ గిల్ 36 పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ మాత్రం నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి స్కోరు అందించాడు. సుదర్శన్ కు మిల్లర్ తోడు కావడంతో స్కోరు కొంత వేగం పుంజుకుంది. సాయి సుదర్శన్ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత శంకర్, మిల్లర్ లు ఆడుతూ జట్టును విజయపథాన నడిపించారు. గుజారత్ టైటాన్స్ కు ఈ సీజన్ లో రెండు విజయం సాధ్యమయింది. ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే సిక్సర్ కొట్టిన మిల్లర్ గుజరాత్ కు విజయాన్ని అందించారు.


Tags:    

Similar News