IPL 2024 : చెత్త బౌలింగ్.. బెంగలూరు జట్టులో లోపం అదే.. అందుకే ముంబయి విజయం
ముంబయిలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో ముంబయిదే విజయం అయింది
నిన్న జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు ఇప్పటి వరకూ ఛాంపియన్ కాలేదు. కానీ ఆ జట్టు ఛాంపియన్ కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులో కింగ్ విరాట్ కోహ్లి ఉండటమే కారణం. కోహ్లికి వీరాభిమానులు ఎక్కువ కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈసారైనా ఛాంపియన్ గా అవతరిస్తుందనుకుంటే ఐదు వరస ఓటములతో ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. బ్యాటింగ్ పరవాలేదనిపించినా .. బౌలింగ్ బలహీనంగా ఉండటమే దీనికి కారణమని చెప్పకతప్పదు.
బ్యాటర్లలోనూ...
బ్యాటర్లలో కూడా మ్యాక్స్‌వెల్ ఇప్పటి వరకూ పొడిచింది లేదు. వరల్డ్ కప్ లో ఇరగదీసిన మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ లో మాత్రం డకౌట్ లకే పరిమితమవుతున్నాడు. నిన్న ముంబయిలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, ముంబయి ఇండియన్స్ జట్టులో కూడా కోహ్లి, మ్యాక్స్ వెల్ విఫలమయినా జట్టు స్కోరు బాగానే చేసింది. ఇరవై ఓవర్లలో 197 పరుగులు చేసింది. కేవలం 93 బంతుల్లోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించి ముంబయి ఇండియన్స్ జట్టు విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు విజృంభించి ఆడి ఆది నుంచి జట్టు గెలుస్తుందన్న అంచనాలను పెంచుతూ పోయారు.
బూమ్రా ఐదు వికెట్లు తీసి...
ముంబయి జట్టులో జన్‌ప్రీత్ బూమ్రా ఐదు వికెట్లు తీసి రాయల్ ఛాలెంజర్స్ ను దెబ్బతీశడు. అయితే ఇషాన్ కిషన్ 69, సూర్యకుమార్ యాదవ్ 52, రోహిత్ శర్మ 238 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. టాస్ ఓడిపోవడంతో ముంబయి జట్టు తొలుత బ్యాటింగ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు కు ఇచ్చింది. అయితే డూప్లెసిస్ 61, దినేశ్ కార్తీక్ 53, రజిత్ పాటీదార్ 50 పరుగులు చేసినా ఫలితం లేదు. బౌలర్లు రాణించలేకపోవడంతో ముంబయి జట్టు ఆ లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఈ జట్టులో బలహీనమైనది బౌలింగ్ అని మరోసారి రుజువైంది. ఐదు వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక బెంగలూరు జట్టులో బౌలింగ్ పరంగా మార్పులు చేయకుంటే.. ఇక అంతే మరి అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.