Dhoni : ధోని అంటే అంత పిచ్చి ఎందుకు? ఈ ఫ్యాన్స్ ఇంకెవరికీ ఉండరేమో? ఊగిపోయిన స్టేడియం

మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. అభిమానించే వారి సంఖ్య లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది.

Update: 2024-05-12 14:07 GMT

అవును.. క్రికెట్ లోనే కాదు.. ఏ రంగంలోనైనా మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. ధోనిని అభిమానించే వారి సంఖ్య లక్షల్లో కాదు..కాదు.. కోట్లలో ఉంటుంది. ఇప్పటికీ మహేంద్రుడిపై ఆ అభిమానం చెక్కు చెదరేలేదు. వయసుతో నిమిత్తం లేదు. జెండర్ తో పనిలేదు. ప్రాంతాలతో అస్సలు చూడటానికి కూడా సరికాదు. ఏ ప్రాంతమైనా.. ఏ మైదానమైనా.. ఏ నగారానికైనా ధోని వస్తున్నాడంటే ఒక్కసారి చూస్తే చాలు అనుకునేంత స్థాయిలో అభిమానులు ఉంటారు. మిస్టర్ కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో రాకపోయినా సరే.. గ్యాలరీ నుంచి కనిపిస్తే చాలు మైదానంలో వినిపించే సౌండ్ మామూలుగా ఉండదు.

అత్యధిక డెసిబుల్ సౌండ్ లో...
మైదానంలో మైకుల కంటే అత్యధికంగా డెసిబుల్ సౌండ్ లో ఫ్యాన్స్ నినాదాలు వినిపిస్తాయి. ధోని.. ధోని అంటూ ఊగిపోతారు. చివరకు ప్లకార్డులు కూడా ధోనికి కనిపించినట్లుగా మరే ఆటగాడికి కనిపించవు. సెలబ్రటీల నుంచి సామాన్యుల వరకూ ధోనిని అభిమానించని వారుండరు. ధోని స్టయిల్ చూసి కాదు.. ధోని వచ్చి గెలిపిస్తాడని కాదు.. కేవలం ధోని క్యారెక్టర్ చూసి కోట్లాది మంది అభిమానులు అతని సొంతమయ్యారంటే అతశయోక్తి కాదనిపిస్తుంది. ధోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. ఒక్క ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రమే అతను ఆడుతున్నాడు. ఈ ఏడాది కెప్టెన్సీని కూడా తాను వదులుకుని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించారు. మ్యాచ్ చెన్నై ఓడిపోయినా పెద్దగా దిగులుపడరు. ధోని బ్యాటింగ్ కు రావాలనుకుంటారు.
మదర్స్ డే శుభాకాంక్షలు కూడా...
ఇక వికెట్ కీపర్ గా ధోనీ కదిలికలను చూస్తే ఈ వయసులోనూ అంత స్పీడ్ ను చూసి, వికెట్లును బంతితో తీసే వేగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఇప్పుడు మైదానంలో కనిపించే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడకు వేలాది మంది అభిమానులు ప్రత్యక్షమవుతారు. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు కూడా అత్యధిక మంది అభిమానులు హాజరయ్యారు. ఈరోజు మదర్స్ డే కావడంతో ధోనిని దేశానికి అందించిన మహేంద్రుడి తల్లికి అభినందనలు తెలుపుతూ ప్లకార్డులు పట్టుకుని చెన్నై స్టేడియంలో కనిపించారంటే ఏ రేంజ్ లో ధోనీ అభిమానం ఉందో ఇది చెప్పేది. మహేంద్రుడి పై అభిమానం ఎన్నటికీ తరగనది.. చెక్కు చెదరనిది.


Tags:    

Similar News