IPL 2024 : ప్లేఆఫ్ లో రెండో ప్లేస్ లో సన్ రైజర్స్... పంజాబ్ కింగ్స్ పై సూపర్ విక్టరీ

హైదరాబాద్ సన్ రైజర్స్ తో చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు చేసింది

Update: 2024-05-19 13:44 GMT

హైదరాబాద్ సన్ రైజర్స్ తో చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు చేసింది. అయినా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచి ప్లేఆఫ్ లోకి రెండోస్థానంలోనిలిచింది. భారీ స్కోరు చేసినా పెద్దగా టెన్షన్ లేకుండానే చివరి లీగ్ మ్యాచ్ ను విజయంతో సన్ రైజర్స్ ముగించింది. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ జితేన్ శర్మ కెప్టెన్సీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేసింది. ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆధర్వ తైడే 46 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 71 పరుగులు చేసి ఫుల్ ఫామ్ లో తాను ఉన్నాననని మరొకసారి నిరూపించాడు. రిలీ రోసో 49 పరుగులు చేశాడు. కెప్టెన్ జితిన్ శర్మ 32 పరుగులు చేయడంతో జట్టుకు భారీ స్కోరు లభించింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు, కమిన్స్, విజయ్‌కాంత్ తలో వికెట్ ను పడగొట్టారు.

ఛేదనకు దిగిన...
అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ తొలి ఓవర్లలోనే ఓపెనర్ హెడ్ డకౌట్ అయి వెనుదిరిగాడు. తర్వాత అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు దూకుడుగా ఆడారు. జట్టు స్కోరును భారీగా పెంచారు. ఇద్దరూ సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించారు. రాహుల్ త్రిపాఠి 33 పరుగుల వద్ద అవుట్అయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయినా అబిషేక్ శర్మ నిలబడి సికర్సు బాదుతూ హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఎండ్ లో నితీష్ కుమార్ రెడ్డి శర్మకు సహకారం అందిస్తూ నిలకడగా ఆడుతూ సహకరించడంతో జట్టు స్కోరు కేవలం ఎనిమిది ఓవర్ లోనే వంద పరుగులు దాటింది. అభిషేక్ శర్మ 66 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత నితీష్ రెడ్డి 37 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే స్కోరు 175 పరుగులు దాటడంతో కేవలం నాలుగు వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అందరూ అంచనా వేశారు.
చివరి మ్యాచ్ లో...
ఇంకా ఐదు ఓవర్లకు పైగానే ఉండటం చేయాల్సిన పరుగులు కూడా పెద్దగా లేకపోవడంతో ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై హైదరాబాద్ విజయం సాధిస్తుందని భావించారు. క్లాసెన్ కూడా ఉండటంతో పెద్దగా జట్టు ఓటమి పాలవుతుందని భయం మాత్రం కనిపించలేదు. క్లాసెన్ నిలకడగా ఆడుతూ నలభై రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. షాబాద్ కూడా మూడు పరుగులకు అవుటయ్యాడు. సమద్, శాన్విర్ క్రీజులో నిలిచారు.  చివరి ఓవర్ కు నాలుగు పరుగులే చేయాల్సి రావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు.  హైదరాబాద్ లో వర్షం పడే సూచనలు ఉండటంతో మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? లేదా? అన్న దానిపై తొలి నుంచి అనుమానాలు అయితే ఉన్నాయి. మేఘాలు కమ్ముకోవడంతో వర్షం పడితే మ్యాచ్ ఆగిపోతుందన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కానీ చివరకు సన్ రైజర్స్ మ్యాచ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. 


Tags:    

Similar News