India 2024 : ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ మనదే... టెస్ట్ సిరీస్ మాత్రం చేజారింది

భారత్ క్రికెట్ కు 2024 ఏడాది కొంచెం తీపి.. కొంచెం చేదు ఎదురయింది.

Update: 2024-12-18 11:49 GMT

భారత్ క్రికెట్ కు 2024 ఏడాది కొంచెం తీపి.. కొంచెం చేదు ఎదురయింది. 2024 టీ 20 ప్రపంచకప్ లో విశ్వ విజేతగా టీం ఇండియానిలిచింది.జూన్ 29వ తేదీన దక్షిఫిక్రాతో జరిగినఫైనల్ లో రోహిత్ సేన ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. నిజంగా ఇది టీం ఇండియాకు రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్. గతంలో 2007లో భారత్ ధోని సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. టీం ఇండియా టీ 20 ప్రపంచకప్ ను విజయం సాధించడంతో భారత్ ప్రతిష్టను మరింత మెరుగుపర్చింది. ఇండియాకు చివరి అంకంలో ఓటమి భయం ఎక్కువగా ఉంటుంది. డెత్ ఓవర్లలో మన బౌలర్లుకూడా అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయకపోవడం కూడా టీం ఇండియా బలహీనత.


క్రికెట్ ఫ్యాన్స్ కు...

అలాగే వన్డే కప్ ను చేజార్చుకున్న తర్వాత సాధించిన విజయం కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఊపు తెచ్చిపెట్టింది. ప్రపంచ ఛాంపియన్ గా నిలబడటంతో భారత్ కు ప్రపంచంలోనే క్రికెట్ టీం కు మంచి మార్కులు పడ్డాయి. టీ 20లలో మనకు తిరుగులేదని నిరూపించింది. ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ కు కొరత లేదు. క్రికెట్ కు ఉన్న క్రేజ్ భారత్ లో మరే ఆటకు లేదు. ప్రొకబడ్డీ వంటివి ఇటీవల కాలంలో జనాదరణ పొందుతున్నప్పటికీ ఏదైనా క్రికెట్ తర్వాతే. డబ్బులు కురిపించే ఆట కావడంతో పాటు అత్యధికమంది అలవాటుపడిన, చూసే ఆటగా క్రికెట్ రూపాంతరం చెందింది. తొలి నుంచి క్రికెట్ కు ఉన్న ఆదరణ మరే ఆటకు లేకపోవడంతో ఈ ఆటకు మరింత ప్రాధాన్యత పెరిగింది.
దారుణమైన ఓటమి...
అయితే ఇదే ఏడాది మరో దారుణమైన ఓటమిని కూడా భారత్ చవి చూడాల్సివచ్చింది. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ చేజార్చుకోవాల్సి వచ్చింది. మూడు మ్యాచ్ ల భారత్ వేదికగా జరిగినా టీం ఇండియా న్యూజిలాండ్ పై విజయం సాధించలేకపోయింది. పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ను చేజార్చుకుంది. మూడు మ్యాచ్ లలో ఏ ఒక్కమ్యాచ్ లోనూ భారత్ పై చేయిసాధించలేకపోయింది. తొలి రెండు మ్యాచ్ లలో న్యూజిలాండ్ గెలవడంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్ట్ సిరీస్ ను భారత్ చేజార్చుకున్నట్లయింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. ఆడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ మ్యాచ్ లో మాత్రం పరాభవం ఎదురయింది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవాలంటే రానున్న మూడు మ్యాచ్ లను భారత్ గెలవాల్సి ఉంటుంది. కాని గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags: