లేట్ అయినా… లేటెస్ట్ గా వస్తా

2020 సంక్రాతి జోరు అప్పుడే మొదలయ్యింది. మహేష్ – అల్లు అర్జున్ – రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు సంక్రాంతిని బుక్ చేసేసుకున్నారు. ఇక మధ్యలో కళ్యాణ్ [more]

;

Update: 2019-09-25 08:53 GMT
లేట్ అయినా… లేటెస్ట్ గా వస్తా
  • whatsapp icon

2020 సంక్రాతి జోరు అప్పుడే మొదలయ్యింది. మహేష్ – అల్లు అర్జున్ – రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు సంక్రాంతిని బుక్ చేసేసుకున్నారు. ఇక మధ్యలో కళ్యాణ్ రామ్ కూడా నేను ఉన్నాను ఆగండి అంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల అలా వైకుంఠాపురానికి సంక్రాతి విడుదల డేట్ కూడా ఇచ్చేసారు. జనవరి 12 న అలా కి డేట్ ఇవ్వగా.. రజినీకాంత్ తన దర్బార్ ని ప్రతి ఏడు లాగే జనవరి 10 న ఖాయం చేసేలా కనబడుతున్నాడు. ఇక మిగిలిన మహేష్ సరిలేరు నీకెవ్వరూ డేట్ విషయంలో లెక్క తేలడం లేదు.

ఆగాల్సిందే…..

కారణం అల్లు అర్జున్ కన్నా ముందు జనవరి 11న వద్దామని నిర్మాతలు చెబుతున్నప్పటికీ… మహేష్ వద్దంటున్నాడట. కారణం జనవరి 9, 10, 11 తేదీల్లో విడుదలైన సినిమాలేవీ పెద్దగా హిట్ కావడం లేదని.. అందుకే అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో తర్వాత అంటే… జనవరి 14 వస్తే బెటర్ అంటూ నిర్మాతలకు మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి డేట్ సూచిస్తున్నాడట. 11 న వస్తే క్యాష్ చేసుకోవచ్చని నిర్మాతలంటుంటే.. మహేష్ మాత్రం లెట్ అయినా.. లేటెస్ట్ గా దిగుదామని చెబుతున్నాడట.

 

 

Tags:    

Similar News