ఆచార్య టీజర్ అప్ డేట్!

ఈ కాలంలో పబ్లిసిటీ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో.. చిరు బాగా గమనించినట్టుగా ఉన్నారు. అందుకే వెరైటీగా తన రీసెంట్ చిత్రం ఆచార్య విషయంలో కొత్తగా అలోచించి.. [more]

Update: 2021-01-27 09:50 GMT

ఈ కాలంలో పబ్లిసిటీ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో.. చిరు బాగా గమనించినట్టుగా ఉన్నారు. అందుకే వెరైటీగా తన రీసెంట్ చిత్రం ఆచార్య విషయంలో కొత్తగా అలోచించి.. కొరటాలకు తాను వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఓ మీమ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆచార్య టీజర్ కోసం వెయిటింగ్.. నువ్వు ఇస్తావా నన్ను లీక్ చేయమంటావా అంటూ ఫన్నీగా కొరటాలకి వార్నింగ్ ఇచ్చిన చిరుతో అంతే ఫన్నీగా కొరటాల శివ జవాబులు ఇచ్చారు. న్యూ ఇయర్ లేదు, సంక్రాంతి కి లేదు.. ఇప్పుడయినా ఆచార్య అప్ డేట్ ఇస్తావా అన్నట్టుగా చిరుకి కొరటాల ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా ఆచార్య అప్ డేట్ మీ ముందు ఉంటుంది అని చెప్పినట్టుగానే ఆచార్య టీజర్ జనవరి 29 న అంటూ అధికారిక ప్రకటన చేసాడు కొరటాల.


ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడంతో ఆ సినిమాపై అందరిలో భారీ అంచనాలు భారీ ఆసక్తి ఉన్నాయి. ఇక నిన్న రిపబ్లిక్ డే రోజున చిరు ఆచార్య విషయాన్నీ కదపడంతో నిన్నటి నుండి మెగా ఫాన్స్ మొత్తం సోషల్ మీడియాలోనే ఉన్నారు. ఆచార్య టీజర్ అప్ డేట్ కోసం వెయిటింగ్ అంటుంటే.. మెగా డాటర్ నిహారిక ఏకంగా మీరు చెప్పినట్టుగా రేపు ఉదయం వరకు ఆచార్య టీజర్ అప్ డేట్ కోసం వెయిట్ చేయలేము.. మీరు లీక్ చేసెయ్యండి డాడీ.. సెలెబ్రేషన్స్ చేసుకుందాం అన్నట్టుగా ఉన్నారు ఫాన్స్ మొత్తం. కొరటాల ఎందుకు మీరే లీక్ చెయ్యండి బాస్ అంటూ చిరు కి ట్వీట్స్ చేస్తున్నారు. మరి కొరటాల శివ జనవరి 29 సాయంత్రం 4.05 నిమిషాలకు ఆచార్య టీజర్ అని ఆఫీసియల్ అనౌన్సమెంట్ ఇవ్వడంతో జనవరి 29 న ఆచార్య టీజర్ ని ట్రేండింగ్ లోకి తెచ్చి మిగతా హీరోలకి షాకిచ్చే ఏర్పాట్లలో మెగా ఫాన్స్ ఉన్నారు.

Tags:    

Similar News