నటి మీనా భర్త మృతి

నటి మీనా భర్త విద్యాసాగర్ నిన్న రాత్రి చెన్నై లో మరణించారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు;

Update: 2022-06-29 02:54 GMT

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ నిన్న రాత్రి చెన్నై లో మరణించారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో ఆయనను చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉంది. అయితే డోనర్ లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఆరోగ్యం విషమించి విద్యాసాగర్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా...

48 సంవత్సరాలున్న విద్యాసాగర్ మరణం పట్ల పలువురు సీని ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఈరోజు విద్యాసాగర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. విద్యాసాగర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. 2009 లో మీనా విద్యాసాగర్ ల వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమార్తె ఉంది. విద్యాసాగర్ మృతితో మీనా కుటుంబంలో విషాదం నెలకొంది.


Tags:    

Similar News