బాలకృష్ణ డిఫరెంట్ లుక్ .. రేపు విజయవాడలో టీజర్ లాంచ్

మొదటి సీజన్ కు ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో.. రెండో సీజన్ నూ మొదలుపెట్టేసింది ఆహా. ఇప్పటికే రెండో సీజన్ కు..;

Update: 2022-10-03 10:32 GMT

balayya new look in US2

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా సంస్థ రూపొందించిన షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ కు ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో.. రెండో సీజన్ నూ మొదలుపెట్టేసింది ఆహా. ఇప్పటికే రెండో సీజన్ కు సంబంధించిన కొన్ని అప్ డేట్స్ ఇచ్చింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 సాంగ్ ని విడుదల చేసిన ఆహా.. తాజాగా బాలయ్య సరికొత్త లుక్ ను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. తలపై క్యాప్, చేతిల్ గన్ తో ఉన్న బాలయ్య ఆఫ్ లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా.. రేపు విజయవాడలో అన్ స్టాపబుల్ సీజన్ 2 టీజర్ ను ఆవిష్కరించనున్నట్లు మరో పోస్ట్ చేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు న్యూ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులో ఉన్న అన్మోల్ గార్డెన్స్ లో.. 30 వేల మంది బాలకృష్ణ అభిమానుల సమక్షంలో టీజర్ ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ టీజర్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.


Tags:    

Similar News