పాపం.. అజ‌య్ భూప‌తి ప‌రిస్థితి చూశారా..?

“ఆర్ఎక్స్ 100” దర్శకుడు అజ‌య్ భూప‌తి నాగ చైతన్య – సమంత జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నాడని గత కొన్ని రోజుల నుండి [more]

Update: 2019-05-11 06:39 GMT

“ఆర్ఎక్స్ 100” దర్శకుడు అజ‌య్ భూప‌తి నాగ చైతన్య – సమంత జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో లేనట్టే అని చెబుతున్నారు. కారణం చైతుకి వరుస కమిట్మెంట్స్ ఉండటం. చైతు ప్రస్తుతం వెంకీమామ చేస్తున్నాడు. ఇందులో చైతుకి మామగా వెంకీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత మేర్లపాక గాంధీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేస్తాడు.

హిట్ సినిమా తీసినా…

అలానే రామరాజు అనే సినిమా కూడా చేయనున్నట్టు టాక్. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతు అజయ్ కి నో చెప్పాడని టాక్. అలా మొత్తనికి చైతు అజయ్ క‌లిసి చెయ్యట్లేదు అని క్లారిటీ వచ్చింది. “ఆర్ఎక్స్ 100” లాంటి సూపర్ హిట్ తరువాత అజయ్ రెండో సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు కానీ ఏది ఓకే కావట్లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఆ డైరెక్టర్ చుట్టూ చాలా అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఎందుకో ఏంటో అజయ్ కు అలా జరగడం లేదు. మరి అజయ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అని తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News