బెల్లంకొండ లాగా.. అఖిల్ కూడా..!

టాలీవుడ్ లో బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుని స్టార్ హీరో చెయ్యాలని.. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్, స్టార్ డైరెక్టర్స్ ని తీసుకొస్తూ పడని పాట్లు లేవు. [more]

Update: 2019-05-08 06:15 GMT

టాలీవుడ్ లో బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుని స్టార్ హీరో చెయ్యాలని.. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్, స్టార్ డైరెక్టర్స్ ని తీసుకొస్తూ పడని పాట్లు లేవు. అయినా బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ హీరో రేంజ్ అందుకోలేక చతికిల పడుతున్నాడు. శ్రీనివాస్ కేవలం స్టార్ హీరోయిన్స్, స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. భారీ బడ్జెట్ చిత్రాలే చేస్తున్నాడు. కానీ నాగార్జునకి కొడుకై ఉండి… అఖిల్ ని స్టార్ హీరో చెయ్యాలని ఉన్నప్పటికీ నాగార్జున ఇంకా మీనమేషాలు లెక్క‌బెడుతున్నాడు. స్టార్ హీరోయిన్స్ ని కాదు కదా స్టార్ డైరెక్టర్స్ ని కూడా నాగార్జున అఖిల్ కి సెట్ చెయ్యడం లేదు. అందుకే మూడు సినిమాలు చేసినా ఇంకా హీరోగా నిలబడడానికి తంటాలు పడుతున్నాడు. నాగార్జున లాంటి ఫాదర్ ఉండి కూడా అఖిల్ ఇంకా హీరోగా ఎదగలేదు.

నాగార్జున పెట్టుబ‌డి పెడితేనే..

తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చెయ్యబోతున్న అఖిల్ కి ఇప్పుడు హీరోయిన్ కష్టాలు వెంటాడుతున్నాయి. అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ నటిస్తే అఖిల్ కి, సినిమాకి కూడా క్రేజ్ వస్తుందని.. అందుకే కియారా అద్వానీ, రశ్మిక పేర్లు వినబడ్డాయి. కానీ వారు అఖిల్ పక్కన సూట్ కారని.. కొత్త హీరోయిన్స్ ని భాస్కర్ వెతుకుతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. కథలో హీరోయిన్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోయిన్ అయితే కథకి న్యాయం జరుగుతుందని.. అందుకే స్టార్ హీరోయిన్ కోసం చూస్తుందట టీం. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కి పెట్టుబడి పెట్టే నిర్మాతలకు బెల్లంకొండ సురేష్ కాస్త అండగా ఉన్నట్లుగా ఇప్పుడు అఖిల్ 4వ సినిమాకి గీత ఆర్ట్స్ తో పాటుగా నాగార్జున కూడా కొంత మొత్తం పెట్టబోతున్నట్లుగా వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. మరి సురేష్ లాగా.. కొడుకుని గాడిన పడెయ్యడానికి నాగార్జున కూడా పూనుకుంటే అఖిల్ కెరీర్ గాడిన పడేలా కనబడుతుంది.

Tags:    

Similar News