Akkineni Akhil : అక్కినేని వారి అబ్బాయి అదృష్టం ఎలా ఉందో? హిట్ గ్యారంటీ అటగా

అక్కినేని అఖిల్ నటిస్తున్నలేటేస్ట్ మూవీ లెనిన్ పై అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆశలు పెట్టుకున్నారు;

Update: 2025-04-13 07:53 GMT
akhil akkineni, lenin,  latest movie, tolywood
  • whatsapp icon

అక్కినేని కుటుంబంలో హీరోలు అందరూ క్లిక్ అయ్యారు. ఎందుకో ఏమో కానీ అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటి వరకూ ఒక బ్లాక్ బస్టర్ ను కూడా రుచి చూడలేదు. అక్కినేని కుటుంబానికే కాదు ఫ్యాన్స్ కు కూడా ఇది ఎంతో నిరాశను కలిగిస్తుంది. మంచి ఫిజిక్, మంచి రూపం ఉన్నప్పటికీ అఖిల్ హీరోగా క్లిక్ కాలేకపోతున్నాడు. తండ్రి నాగార్జున, తల్లి అమలకు అఖిల్ ఇండ్రస్ట్రీలో మంచి హిట్ చూడలేదన్న బాధ మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. చిన్న నాడే సిసింద్రీగా అందరినీ ఆకట్టుకున్న అఖిల్ ఏ ప్రాజెక్టు పట్టుకున్నాపెద్దగా కలసి రావడం లేదు.

ఎన్నో ఆశలు...
కథలో లోపమా? దర్శకుల ఎంపికలో వైఫల్యమా? అన్నది తెలియకున్నా ఇప్పటి వరకూ మాత్రం అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అఖిల్ నటిస్తున్నలేటేస్ట్ మూవీ లెనిన్ పై అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించే ఈ మూవీని నాగవంశీ, నాగార్జున అక్కినేని కలసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడి కావడంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచినట్లే భావిస్తున్నారు.
అన్నీ కలగలిపి...
ప్రేమతో పాటు యాక్షన్, రొమాన్స్ కలగలిపి ఈ మూవీని తీసినట్లు గ్లింప్స్ ను చూసివారికి ఎవరికైనా అర్థమవుతుంది. దీంతో పాటు గ్రాఫిక్ వర్క్స్ తో పాటు వీఎఫ్ఎక్స్ లు కూడా అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా అదిరిపోయిందని మూవీ మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో విభిన్న పాత్రలో అఖిల్ కనిపిస్తారని, ఖచ్చితంగా అఖిల్ కు ఇది మంచి సినిమా అవుతుందని, కెరీర్ లో హిట్ సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి.. మరి అఖిల్ అదృష్టం ఎలా ఉందో?


Tags:    

Similar News