‘నేను మారిపోయానోచ్’ అంటున్న సామ్..!

టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లికి ముందు వేరు.. పెళ్లి తరువాత వేరు అన్నట్టు మారిపోయింది. పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్ అక్కినేని ఫ్యాన్స్ నుండి [more]

Update: 2019-02-14 10:22 GMT

టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లికి ముందు వేరు.. పెళ్లి తరువాత వేరు అన్నట్టు మారిపోయింది. పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్ అక్కినేని ఫ్యాన్స్ నుండి ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. హనీమూన్‌ సమయంలో చైతుతో కలిసి దిగిన ఫొటోస్ విషయంలో.. పెళ్లి తరువాత రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమాలో చెర్రీకి లిప్‌లాక్ ఇచ్చినప్పుడు సమంత మీద తీవ్ర విమర్శలొచ్చాయి. నాగార్జున నుంచి చివాట్లు పడ్డట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ‘డోంట్ కేర్’ ధోరణితోనే దూసుకెళ్తోంది సామ్.

తెలుగమ్మాయిలా…

ఇక తాజాగా ‘నేను మారిపోయానోచ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ‘చీరకట్టు’ ఫోటోలు పెట్టి దండోరా వేసుకుంది. ఎన్నడూ లేని విధంగా చూడముచ్చటగా, పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించిన సమంత మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ఈమెకు ఫాలోయర్స్ సంఖ్య కూడా 60 లక్షలకు చేరుతున్న సందర్భంగా ఖుషీగా ఉందంటూ ‘దిసీజ్ మీ’ అంటూ కన్నుగీటుతోంది.

Tags:    

Similar News