విలన్ గా అక్షయ్ ఫిక్స్..!

2.0 చిత్రం తరువాత శంకర్ ‘భారతీయుడు’ చిత్రం సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు. గతంలో కమల్ హాసన్ తో శంకర్ తీసిన ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్స్ క్రియేట్ [more]

Update: 2019-01-17 11:29 GMT

2.0 చిత్రం తరువాత శంకర్ ‘భారతీయుడు’ చిత్రం సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు. గతంలో కమల్ హాసన్ తో శంకర్ తీసిన ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’ పేరుతో సీక్వెల్ చేయడానికి శంకర్ రెడీ అయ్యాడు. ఆల్రెడీ దానికి సంబందించిన పనులు కూడా చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కాజల్ ఈ సినిమా తన కెరీర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని మురిసిపోతోందట.

ఓకే చెప్పిన అక్షయ్…

సేనాపతి మనవడి పాత్రలో శింబు కనిపించనున్నాడు. ఇక విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విలన్ గా అక్షయ్ కుమార్ నే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట శంకర్. అక్షయ్ కూడా స్టోరీ విన్న వెంటనే ఓకే చేసినట్టు సమాచారం. ‘2.ఓ’లో విలన్ గా చేసిన అక్షయ్ కుమార్ అందరినీ మేప్పించాడు. అందుకే మరోసారి శంకర్ ఆయననే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

Tags:    

Similar News