నరేష్ సక్సెస్ అవుతాడా?
అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కామెడీ సినిమాలు చేస్తాడు అని మంచి గుర్తింపు ఉండేది. కానీ తన తండ్రి చనిపోయిన తరువాత [more]
అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కామెడీ సినిమాలు చేస్తాడు అని మంచి గుర్తింపు ఉండేది. కానీ తన తండ్రి చనిపోయిన తరువాత [more]
అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కామెడీ సినిమాలు చేస్తాడు అని మంచి గుర్తింపు ఉండేది. కానీ తన తండ్రి చనిపోయిన తరువాత నరేష్ లైఫ్ మారిపోయింది. ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. తన తండ్రి చనిపోకముందు అతనికి ఏమన్నా ఫెయిల్యూర్స్ వచ్చిన వెంటనే తన తండ్రి నరేష్ తో ఒక సినిమా తీసి హిట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అతనికి ఎవరు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు.
ప్రస్తుతం నరేష్ కు హీరోగా అవకాశాలు లేనిస్థితికి చేరుకున్నాడు. అయితే ఈనేపధ్యంలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఓకే చెప్పాడు. అలా చెప్పాడో లేదో వెంటనే మహర్షి లాంటి పెద్ద సినిమా చేతికి వచ్చింది.
మహర్షి లో నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపిస్తాడు. తన పాత్ర నిడివి తక్కువ సేపే అయినా ఉన్న కొంతసేపు కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుందని సమాచారం. నరేష్ – మహేష్ మధ్య ఫ్రెండ్ షిప్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి చెబుతున్నారు. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి