గత నాలుగు రోజులుగా అల్లు అర్జున్ - విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. విక్రమ్ చెప్పిన సెకండ్ హాఫ్ స్టోరీతో పాటుగా క్లైమాక్స్ కూడా బన్నీ కి నచ్చక పోవడం వలన విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిసినట్లుగా వార్తలొచ్చాయి అయితే నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ కి కారణాలు వెతుకుతూ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాల గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ ని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కున్నట్లుగా రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. కానీ మధ్యలో ఆగిపోయిందనే వార్తొకటి.
మంచి సినిమా ఇస్తాను.. కొద్దిగా ఆగండి
అయితే తాజాగా విక్రమ్ కుమార్ తో సినిమా ఉంటుందో లేదో క్లారిటీ ఇవ్వలేదు గాని.. తన నుండి మంచి సినిమా కావాలంటే కాస్త ఓపిక పట్టాలంటూ అభిమానులకు సందేశం పంపాడు అల్లు అర్జున్. తన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. నామీద ఇంత ప్రేమాభిమానులు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు... దయచేసి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ సారి మీకు మంచి సినిమా ఇస్తాను.. కాకపోతే దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటివరకు నన్ను అర్ధం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ తన అభిమానులకు, మీడియా మిత్రులకి కలిపి మరీ ట్వీట్ చేసాడు.
దర్శకుడు ఎవరో మాత్రం చెప్పలేదు...
కానీ ఏ డైరెక్టర్ తో తన సినిమా ఉంటుంది... అసలు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది. విక్రమ్ కుమార్ తోనే తన సినిమా ఉంటుందని కన్ఫర్మ్ మాత్రం చెయ్యకుండా అందరినీ తన ట్వీట్ తో సస్పెన్సు లో పడేసాడు ఈ మెగా హీరో. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు మాత్రం తమ హీరో తమకి సమాధానం ఇచ్చినందుకు సంతోషం గాను... మరో పక్క నెక్స్ట్ ప్రోజెక్ట్ లేట్ అవుతున్నందుకు కష్టంగానూ ఫీల్ అవుతున్నారు.