బన్నీ లుక్ అండ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్

‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత మరో సారి సేమ్ కాంబినేషన్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనున్నారు త్రివిక్రమ్ అండ్ బన్నీ. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో [more]

Update: 2019-02-03 03:49 GMT

‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత మరో సారి సేమ్ కాంబినేషన్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనున్నారు త్రివిక్రమ్ అండ్ బన్నీ. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది. దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతుంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కాబట్టి ఇప్పటి నుండే ఈసినిమా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

ఈ నెల సెకెండ్ వీక్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతుంది. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సరసన నటించే హీరోయిన్నీ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. ఇందులో అల్లు అర్జున్ ని కాస్త వైవిధ్యంగా చూపించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడు కాబట్టి బన్నీ కు సరి జోడిగా ఎవరు సెట్ అవుతారో అని త్రివిక్రమ్ చూస్తున్నాడట.

ఇందులో బన్నీ లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అందుకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ సూచన మేరకు బన్నీ కాస్త వెయిట్ తగ్గపోతున్నాడట. అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చబోతున్నాడట. మరి ఈ లుక్ ఎలా ఉంటాదో అని ఇప్పటినుండే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News