పూజని ఎలా చూపిస్తాడో?

త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పంచ్ లతో పాటుగా.. హీరోయిన్స్ కి ఏదో ఒక వీక్ నెస్(లోపం) ఉండడం గమనిస్తూనే ఉన్నాం. కామెడీ పంచ్ పేల్చడమే కాదు… హీరోయిన్స్ [more]

Update: 2019-10-20 04:01 GMT

త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పంచ్ లతో పాటుగా.. హీరోయిన్స్ కి ఏదో ఒక వీక్ నెస్(లోపం) ఉండడం గమనిస్తూనే ఉన్నాం. కామెడీ పంచ్ పేల్చడమే కాదు… హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ రోల్స్ ఇస్తూ.. వాళ్ళ అమాయకత్వంతో మట్లాడే మాటలకూ ప్రేక్షకులు పడిపోవాల్సిందే. గతంలో జల్సా సినిమాలో ఇలియానా ని హాట్ గా చూపిస్తూనే ఆమెలోని తింగరితనాన్ని ఆమె మాటల్తో చేష్టలతో నవ్వించాడు. ఇక జులాయి సినిమాలోనూ ఇలియానా కి తింగరి తనం ఎక్కువ, తెలివితేటలు తక్కువ. అంతేనా సన్నాఫ్ కృష్ణమూర్తి లోను సమంత ని హాట్ గా గ్లామర్ గా చూపిస్తూనే ఆమెకి డయాబెటిస్ వ్యాధి ఉందని అందుకే చక్లెట్స్ తింటూ అమాయకంగా ఉండేలా చూపించాడు. ఇక త్రివిక్రమ్ మొదటి డిజాస్టర్ అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మన్యువల్ కి అసలు మెదడు ఉందో.. లేదో.. అనే డౌట్ కొట్టే తెలివితేటలు ఉంటాయి.

మరి అరవింద సమేత లో హీరోయిన్ పూజ హెగ్డే ని గ్లామర్ గా మంచి తెలివైన అమ్మాయిలా త్రివిక్రమ్, అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటివరకు బయటికొచ్చిన ఫొటోస్ లో పూజ హెగ్డే బాక్సింగ్ పాప లా మెరిసిపోతుంది. అంటే పూజ హెగ్డే కి ఎలాంటి అమాయకత్వం గాని తింగరితనం కానీ, సిల్లీ జబ్బులను కానీ త్రివిక్రమ్ పెట్టాడు అని అనిపించడం లేదు. మరి పూజ ని పూజలాగే అందంగా చూపిస్తాడో లేదంటే… మరేదన్న లోపాన్ని పూజకి త్రివిక్రమ్ తగిలిస్తాడో చూడాలి.

Tags:    

Similar News