యూజర్లకు షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్.. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా..

అమెజాన్ ప్రైమ్ వీడియో తన యూజర్స్ కి షాక్ ఇవ్వబోతుంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా..

Update: 2023-09-23 11:30 GMT

కరోనా లాక్ డౌన్ వలన ఇండియన్ ఆడియన్స్ కి ఓటీటీ కల్చర్ బాగా అలవాటు పడ్డారు. ఇతర బాషల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ని కూడా ప్రేక్షకులు ఓటీటీలో బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఆడియన్స్ లో ఓటీటీ కంటెంట్ పై ఆసక్తి చూసిన కొన్ని సంస్థలు.. కొత్త కొత్త ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చి మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి.

ఇక ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ చూసిన మూవీ మేకర్స్ కూడా.. కొన్ని సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కొన్ని సినిమాలను ఫ్రీ చూడడానికి అవకాశం కల్పిస్తున్నప్పటికీ, కొన్ని చిత్రాలను మాత్రం సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటూనే చూసేలా అవకాశం ఇస్తుంది. ఇక సబ్‌స్క్రిప్షన్ కోసం కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం అనేక రకాల ప్లాన్స్ ని కూడా ఇస్తూ వస్తున్నారు.
సబ్‌స్క్రిప్షన్ చేసుకోవడం వలన అన్ని సినిమాలు, సిరీస్ ని చూడడమే కాకుండా యాడ్స్ లేకుండా కంటెంట్ ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తుంది. ఈక్రమంలోనే ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' కూడా సబ్‌స్క్రిప్షన్ తో యాడ్ ఫ్రీ కంటెంట్ ని స్ట్రీమ్ చేస్తూ వస్తుంది. అయితే అమెజాన్ ఇప్పుడు తన యూజర్లకు షాక్ ఇవ్వబోతుందంట. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా ఇక నుంచి అమెజాన్ లో యాడ్స్ చూడాల్సిందేనట.
2024 నుంచి అమెజాన్ లో.. ఒక గంట వీడియోకి 4 నిమిషాల యాడ్ ని ప్లే చేస్తారట. ఒకవేళ ఈ యాడ్ కూడా వద్దు అనుకుంటే యూజర్లు.. మరింత ఎక్కువ డబ్బు చాలించాల్సి ఉంటుందట. ఇక ఈ నిర్ణయం పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వలన అమెజాన్ ప్రైమ్ కి సబ్‌స్క్రైబర్స్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీని పై అమెజాన్ ఏమన్నా ఆలోచిస్తోందా..? లేదా..? చూడాలి.


Tags:    

Similar News