అమెజాన్ అడ్డంగా బుక్ అయ్యిందా?
ఇండియాలో ఓటిటి అంటే ఆమెజానే నెంబర్ వన్. అమెజాన్ తర్వాతే ఏ ఓటిటి అయినా అనేలా అమెజాన్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. వెబ్ సీరీస్ అయినా భారీ బడ్జెట్ [more]
ఇండియాలో ఓటిటి అంటే ఆమెజానే నెంబర్ వన్. అమెజాన్ తర్వాతే ఏ ఓటిటి అయినా అనేలా అమెజాన్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. వెబ్ సీరీస్ అయినా భారీ బడ్జెట్ [more]
ఇండియాలో ఓటిటి అంటే ఆమెజానే నెంబర్ వన్. అమెజాన్ తర్వాతే ఏ ఓటిటి అయినా అనేలా అమెజాన్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. వెబ్ సీరీస్ అయినా భారీ బడ్జెట్ మూవీస్ అయినా అమెజాన్ ప్రైమ్ డీల్ కి ఎదురు నిలబడగల సత్తా ఎవరికీ లేదు. ఇక థియేటర్స్ బంద్ నడుస్తుననప్పుడు కూడా అమెజాన్ హవానే కొనసాగింది చిన్న చితక సినిమాలు నెట్ ఫ్లిక్స్ , హాట్ స్టార్, ఆహా, జీ 5 అన్నప్పటికీ మీడియం బడ్జెట్ మూవీస్ ని అమెజాన్ వల వేసి పట్టుకుంది. థియేటర్స్ థియేటర్స్ అన్న వాళ్ళకి భారీ లాభాల ఆశ చూపించి పడేసింది. దానితో సేఫ్ అయ్యారు. అదే బొమ్మ థియేటర్స్ లో పడితే బయ్యర్లకు లాభనష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలతో చర్చిస్తారు.
కానీ ఓటిటి నుండి విడుదలైన సినిమాల్తో నిర్మాతలకు పనిలేదు. అమ్మేసాం చేతులు దులుపుకున్నామా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వారు ఉత్సాహంగా కొన్న పెద్ద సినిమాలు కీర్తి సురేష్ పెంగ్విన్, వి, తాజాగా విడుదలైన నిశ్శబ్దం సినిమాలకు సో సో టాక్ వచ్చి ప్లాప్ లిస్ట్ లో చేరాయి. థియేటర్స్ మాటకు కట్టుబడిన నిర్మాతలను పడేసి మరీ అమెజాన్ భారీ ధరలకు కొన్న సినిమాలు అమెజాన్ కి చుక్కలు చూపించాయి. పెంగ్విన్, నాని వి, అనుష్క నిశ్శబ్ధాలకు సో సో టాక్ రావడంతో అమెజాన్ కి పెద్ద చిల్లే పడింది. మూడు సినిమాలు కలిపి ఏ 80, 90 కొట్లో పెట్టి ఉంటుంది. ఇక అంత డబ్బు రావాలంటే కష్టమే. అందులోను మిడ్ నైట్ అమెజాన్ లో షో పడగానే తెల్లవారుఝాముకే రివ్యూస్ వచ్చేస్తున్నాయి. సినిమా కి పూర్ రేటింగ్ ఇచ్చారంటే చాలు.. టాక్ వీక్ అయ్యి అమెజాన్ యూజర్స్ సంఖ్య పడిపోతుంది. మరి తెలుగు లో మీడియం సినిమాలను కొన్న అమెజాన్ మాత్రం అడ్డంగా బుక్ అయినట్లే కనబడుతుంది.