సంపాదన ఏడాదికి 2 కోట్లా?

హీరోయిన్స్ ఒక్క సినిమా చేస్తే 2 కోట్లు వస్తున్న రోజుల్లో ఏడాదికి 2 కోట్లు ఓ లెక్క అంటే… అది ఓ లెక్కే. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న [more]

Update: 2020-03-20 06:00 GMT

హీరోయిన్స్ ఒక్క సినిమా చేస్తే 2 కోట్లు వస్తున్న రోజుల్లో ఏడాదికి 2 కోట్లు ఓ లెక్క అంటే… అది ఓ లెక్కే. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న యాంకర్ అనసూయ ఏడాదికి 2 కోట్లు సంపాదించడం అంటే మాటలు కాదు… హాట్ యాంకర్ గా పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి…. గ్లామర్ తోనే యాంకర్ అనే పదానికి కొత్తర్ధం చెప్పింది. సుమ కనకాల తర్వాత అనసూయ అనేలా అనసూయ క్రేజ్ తెచ్చుకుంది. సుమ తెలివితేటలతో నెడుతుంటే..ఆనసూయ గ్లామర్ తో అదరగొడుతుంది. ఇటు జబర్దస్త్ షోతో విపరీతమైన క్రేజ్, అటు వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు. ఇలా రెండు చేతుల ఆర్జన చేస్తున్న అనసూయ ఏడాదికి 2 కోట్లు వెనకేస్తుందట.

ఈటివి, జెమిని టివి, జీ ఛానల్ ఎక్కడ చూసినా అనసూయ. అటు ఆడియో లాంచ్ వేడుకలు, ఇటు వెండితెర మీద మంచి కేరెక్టర్స్ మధ్య మధ్యలో అవార్డు వేడుకల స్టేజ్ మీద స్పెషల్ పేరెఫార్మెన్సెస్ తో అదరగొడుతుంది అనసూయ. సంపాదన కోట్లలో ఉంటే.. యాంకర్ గా ఏడాదికి ఓ 20 లక్షలు అందుకుంటున్న అనసూయ స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా మరో 10 లక్షలు వెనకేస్తుంది. ఇక సినిమాల్లో కేరెక్టర్స్ కి ఇంతని ముందే మాట్లాడుకుని అందులో దిగుతుంది. క్రేజ్ తోనే ఫేమ్ సంపాదించిన అనసూయ పెళ్లి తర్వాత కూడా ఈ రేంజ్ సంపాదన అంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే.

Tags:    

Similar News