ఆ బాధను వారి కుటుంబమంతా అనుభవించాలి : రష్మీ గౌతమ్

మూగ జీవులను జాగ్రత్తగా చూసుకోవడమే కాదు.. వాటికి ఎవరైనా బాధ కలిగించినా, వాటిపై దాడులు జరిగినా రష్మీ వెంటనే స్పందిస్తుంది.

Update: 2022-02-02 05:30 GMT

రష్మీ గౌతమ్.. ఈ పేరు తెలియని వారుండరు. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరకు పరిచయమై.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే.. వెండితెరపై తన సత్తా చాటుతోంది. ఓ వైపు యాంకరింగ్, మరోవైపు యాక్టింగ్ తో తానేంటో తెలియజెెప్పే ప్రయత్నం చేస్తోంది రష్మీ. కాగా.. రష్మీకి మూగజీవులంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూగజీవుల కోసం ఆమె చాలా కృషి చేస్తుంది. ముఖ్యంగా శునకాలు, ఆవులంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో రోడ్డు పక్కగా ఉన్న మూగజీవులకు ఫుడ్ కూడా పెడుతుంటుంది. అప్పుడప్పుడు వాటికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

మూగ జీవులను జాగ్రత్తగా చూసుకోవడమే కాదు.. వాటికి ఎవరైనా బాధ కలిగించినా, వాటిపై దాడులు జరిగినా రష్మీ వెంటనే స్పందిస్తుంది. ఇన్ స్టా లో ఆయా ఘటనలపై రష్మీ ఘాటుగానే స్పందిస్తుంటుంది. గతంలో హైదరాబాద్‏లో కుక్కలపై మనుషులు వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మీ. తాజాగా ఓ దారుణ ఘటన మీద రష్మీ మరోసారి ఫైర్ అయ్యింది. బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్లోని యువకుడు తన ఆడి కారును నడుపుతూ.. పడుకుని ఉన్న కుక్క మీదుగా పోనిచ్చాడు. దాంతో ఆ కుక్క చనిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేశారు. అయితే ఆ యువకుడి కుటుంబానికి స్థానికంగా బాగా పలుకుబడి ఉందట. అక్కడి రాజకీయ నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయట. పలుకుబడికి భయపడి పోలీసులు యువకుడిని విడిచిపెడితే ఊరుకోబమని జంతుప్రేమికులు నెట్టింట్లో పోస్టులు చేశారు. ఆ ఘటనపైనే రష్మీ కూడా స్పందించింది. "డబ్బుతో వస్తువులను కొనొచ్చు.. కానీ బుద్దిని, పద్దతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ అమాయకపు జీవి పడ్డ బాధను ఆ కుటుంబం అంతా కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కను రాళ్లతో కొట్టడం అనేది సరదా విషయం అని పిల్లలకు నేర్పించకండి.. వాళ్లే భవిష్యత్తులో ఇలా తయారవుతారు" అని తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.


Tags:    

Similar News