అఖిల్ హీరోయిన్ కి మరో ఆఫర్..!

అఖిల్ ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ ను తన తొలి సినిమా ఫలితం నిరాశపరిచింది. కానీ ఆమెకు ఆఫర్స్ [more]

;

Update: 2019-04-16 08:25 GMT
kalyani in bheeshma movie
  • whatsapp icon

అఖిల్ ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ ను తన తొలి సినిమా ఫలితం నిరాశపరిచింది. కానీ ఆమెకు ఆఫర్స్ రావడం ఆగలేదు. ‘హలో’ చిత్రం ఫెయిల్ అయినా ఆమెకు తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి. అందులో ఒకటి ‘చిత్రలహరి’ గత శుక్రవారం రిలీజ్ అయింది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కళ్యాణి ఖుషీఖుషీగా ఉందట. అలానే ఆమె ప్రస్తుతం శర్వానంద్ – సుధీర్ వర్మ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇలా ఈ రెండు చిత్రాలు కాకుండా మరో సినిమా ఆఫర్ కూడా వచ్చింది కళ్యాణి ప్రియదర్శన్ కు.

సెకండ్ హీరోయిన్ అయినా…

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ నుండి ఆమెకు ఆఫర్ వచ్చింది. ఇందులో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్. కళ్యాణి సెకండ్ హీరోయిన్. పేరుకి రెండో హీరోయిన్ అయినా ఆ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే ఏమి ఆలోచించకుండా కళ్యాణి వెంటనే ఓకే చెప్పింది. ఛలో సినిమాతో మంచి మార్కులు దక్కించుకున్న వెంకీ కుడుముల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags:    

Similar News