అందుకే తప్పుగా అనుకుంటున్నారు?

అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం మూవీ ప్రమోషన్స్ లో బాగా బిజీగా గడపడమే కాదు.. పనిలో పనిగా తన 15 ఏళ్ళ సినిమా కెరీర్ ముచ్చట్లను మీడియాతో పంచుకుంటుంది. [more]

Update: 2020-03-16 06:35 GMT

అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం మూవీ ప్రమోషన్స్ లో బాగా బిజీగా గడపడమే కాదు.. పనిలో పనిగా తన 15 ఏళ్ళ సినిమా కెరీర్ ముచ్చట్లను మీడియాతో పంచుకుంటుంది. అంతేకాకుండా తన పెళ్లిపై మీడియాకి ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మీద ప్రభాస్ మీద పెళ్లి రూమర్స్ రావడానికి అసలు కారణాలు చెప్పింది. తరచూ అనుష్క – ప్రభాస్ పేమ పెళ్లి అంటూ మీడియాలో వార్తలు రాయడం వాటిని అనుష్క, ప్రభాస్ ఖండించడం.. మళ్ళి యధాతధంగా వాళ్ళ పెళ్లిపై పుకార్లు రావడం జరుగుతూనే ఉన్నాయి.

తాను ప్రభాస్ తో చాలా సినిమాల్లో నటించడం… మిర్చి, బాహుబలి, బిల్లా లాంటి సినిమాల్తో హిట్ పెయిర్ గా మారడంతో.. తమ జంట బావుంటుంది అని.. చాలామంది మా పెళ్ళీపై ఊహాగానాలు చేసారు. అంతేకాకుండా ప్రభాస్ నేను చాలా క్లోజ్ గా ఉంటాం. ఎంత క్లోజ్ నెస్ అంటే.. తెల్లవారు ఝామున 3 గంటలకు కూడా మట్లాడుకోగలిగినంత క్లోజ్ గా ఉంటాం. అంత మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం కాబట్టే తమ మీద అలాంటి పెళ్లి రూమర్స్ వస్తున్నాయని.. తనకి ఎలాంటి అవసరం వచ్చినా, మాట్లాడాలిపించినా ప్రభాస్ తో పాటుగా మరికొంతమంది ఫ్రెండ్స్ కి ఎనీ టైం ఎపుడైనా ఫోన్ చేస్తానంటూ ప్రభాస్ – తన మీద వస్తున్న పెళ్లి రూమర్స్ కి ఇలా చెక్ పెట్టింది స్వీటీ అనుష్క.

Tags:    

Similar News