అరుంధతి.. రుద్రమదేవి.. ఇప్పుడు..?

అరుంధతి అంటే… అనుష్క, రుద్రమదేవి అంటే అనుష్కనే గుర్తొస్తుంది. అంతలా ఆయా పాత్రలో అనుష్క పరకాయ ప్రవేశం చేసింది. అరుంధతిగా కత్తి దుయ్యడం, రుద్రమదేవిగా గుర్రమెక్కి యుద్ధం [more]

Update: 2019-07-04 06:10 GMT

అరుంధతి అంటే… అనుష్క, రుద్రమదేవి అంటే అనుష్కనే గుర్తొస్తుంది. అంతలా ఆయా పాత్రలో అనుష్క పరకాయ ప్రవేశం చేసింది. అరుంధతిగా కత్తి దుయ్యడం, రుద్రమదేవిగా గుర్రమెక్కి యుద్ధం చేసిన అనుష్క శెట్టి ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి భాయ్ గా అలరించబోతుంది అనే న్యూస్ హైలెట్ అయ్యింది. అంటే రుద్రమదేవి లా మరో చారిత్రాత్మక చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించడం లేదుగాని…. చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సై రా నరసింహారెడ్డి చిత్రంలో అనుష్క ఓ కీలక పాత్రలో గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది.

అయితే అనుష్క సై రా నరసింహారెడ్డిలో ఐటెం పాటలో ఆడుతుందని, అంతేకాదు అనుష్క శెట్టి సై రా సినిమాలో కథను చెప్పే అమ్మాయిగా కనిపించబోతుందని ప్రచారం జరిగింది కానీ.. తాజాగా అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కకు సంబంధించిన లుక్ ను త్వరలోనే విడుదల చేయనున్నారట. మరి అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి దేవసేనగా ఓ రేంజ్ లో ఇరగదీసిన అనుష్క ఝాన్సీ లక్ష్మి భాయ్ గా ఎలా అలరించబోతుందో.. అనేది చూడాలి. అయితే సై రా లో అనుష్క పాత్ర ఏమిటనేది క్లారిటీ లేదుగాని.. అనుష్క ఝాన్సీ లక్ష్మి భాయ్ పాత్ర చేస్తుందంటూ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అయ్యింది

Tags:    

Similar News