అర్జున్ కి మోక్షం లేదా..?

నిఖిల్ అర్జున్ సురవరం సినిమా విడుదల డేట్ పై ఒక కాంటెస్ట్ రన్ చేస్తే అది ఎంతగా హైలెట్ అయ్యేదో చెప్పలేం. నిఖిల్ – లావణ్య జంటగా [more]

;

Update: 2019-05-31 06:17 GMT
arjun suravaram release date
  • whatsapp icon

నిఖిల్ అర్జున్ సురవరం సినిమా విడుదల డేట్ పై ఒక కాంటెస్ట్ రన్ చేస్తే అది ఎంతగా హైలెట్ అయ్యేదో చెప్పలేం. నిఖిల్ – లావణ్య జంటగా నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదల ముహూర్తమే దొరకడం లేదు. ఏప్రిల్ లో పలు డేట్స్ మార్చుకుని చివరికి మేలో అయినా సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే అర్జున్ సురవరం సినిమా ఊసే వినబడడం లేదు. ఆ మధ్యన అర్జున్ సురవరం ప్రమోషన్స్ ని నిఖిల్ వెరైటీగా మొదలు పెట్టినా… ప్రస్తుతం అయితే ఆ సినిమా మాట ఎక్కడా వినబడడం లేదు. నిఖిల్ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తా అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాడు కానీ.. అర్జున్ సురవరం మాట మాత్రం ఎత్తడం లేదు.

ఇదే మంచి టైం…

ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఆమెకి ఈ సినిమా హిట్ కీలకం. కానీ అర్జున్ సురవరం అసలు విడుదల అవుతుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే వేసవి సెలవులన్నీ పూర్తయ్యి.. స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. ఇక నిఖిల్ అర్జున్ సురవరానికి ఇంతకన్నా మంచి టైం దొరకదు. కానీ అర్జున్ సురవరంపై నిఖిల్ తో పాటు నిర్మాతలకు నమ్మకం లేదేమో అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ తో పాటు విడుదల తేదీని అటకెక్కించారు.

Tags:    

Similar News