వాల్మీకిలో అధర్వకి ఇంపార్టెన్స్ లేదా

తమిళనటుడు అధర్వ మురళి తెలుగు డైరెక్షన్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. హరీష్ శంకర్ కోరిక మేరకు అధర్వ వాల్మీకి సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. [more]

Update: 2019-09-20 07:09 GMT

తమిళనటుడు అధర్వ మురళి తెలుగు డైరెక్షన్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. హరీష్ శంకర్ కోరిక మేరకు అధర్వ వాల్మీకి సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒరిజినల్ ‘జిగర్ తండా’లో సిద్దార్థ్ చేసిన పాత్ర ఇది. అందులో సిద్ధార్థ ది ఏమి అంత తీసేసే పాత్ర కాదు. అతని కంటూ ఓ స్టోరీ ఉంటుంది.

టాక్ అంతా పూజా, వరుణ్ లదే….

కానీ తెలుగులో అధర్వకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అర్ధం అవుతుంది. హరీష్ శంకర్ ఫుల్ ఫోకస్ మొత్తం వరుణ్ తేజ్‌ మీదే పెట్టాడని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కి ఫ్లాష్ బ్యాక్ సైతం యాడ్ చేశాడు హరీష్. వరుణ్ తేజ్ తరువాత అంతటి స్థానంలో పూజా హెగ్డే ఉంది. ఈమెది ఏమి ఫుల్ లెంగ్త్ పాత్ర కాకపోయినా ఉనంత సేపు ఆమె పాత్ర బాగుంటదని చెబుతున్నారు. అంతా వరుణ్ తేజ్, పూజ గురించే మాట్లాడుతున్నారు కానీ అధర్వ గురించి మాట్లాడుకునేవాళ్లే కరవయ్యారు.

ఆయన రోల్ ఏంటి..?

ప్రోమోస్ అన్ని కూడా వరుణ్ అండ్ పూజ లనే హైలైట్ చేస్తూ రిలీజ్ చేసారు. హరీష్ శంకర్ అధర్వ పాత్ర బాగుంటుందని చెబుతున్నాడు కానీ ఈ పాత్ర కోసం హరీష్ మొదట నాగశౌర్య సహా ఇద్దరు ముగ్గుర్ని ట్రై చేసి చివరికి అధర్వ ని తీసుకున్నాడు. తెలుగులో మంచి పేరు తెచ్చుకుంద్దాం అనుకున్న అధర్వ కి ఇది నిజంగా నిరాశే. చూద్దాం మరికొన్ని గంటల్లో అధర్వ పాత్ర కు అసలు ఇంపార్టెన్స్ ఇచ్చారో లేదో అని.

 

Tags:    

Similar News